సోనియాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్‌

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సోనియా మరింతకాలం సేవ చేయాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్‌ చేశారు. 73వ జన్మదినం జరుపుకుంటున్న సోనియా గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. అయితే దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు జరగడం, మహిళలకు భద్రత లేకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సోనియా గాంధీ.. తన పుట్టిన రోజు వేడుకలకు ఆమె దూరంగా ఉన్నారు.